ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఈ వేలంలో 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో అమ్మకానికి పెట్టనున్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వ నిర్దేశిత ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు. వేలంపాట ఆదిలాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa