ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐపై కీలక వ్యాఖ్యలు చేసిన టీసీఎస్ సీఈవో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 03:56 PM

ఏఐపై టీసీఎస్ సీఈవో కృతివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికతకు టీసీఎస్ భయపడదని వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల సంభవించే మార్పులకు అనుగుణంగా కంపెనీ తన విధానాలను మార్చుకుంటోందని వెల్లడించారు. సంస్థ వార్షిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏఐ సాంకేతికత వినియోగంతో స్వీయ ఆదాయం తగ్గినా ఫర్వాలేదని, వీటిని ఉపయోగించాలని సిబ్బందిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు.ఏఐ ఆధారిత సాంకేతిక వినియోగంలో యువ నిపుణులతో పోలిస్తే సీనియర్ స్థాయి ఉద్యోగులు నెమ్మదిగా ఉన్నారని తెలిపారు. తమ కంపెనీకి చెందిన ఆరు లక్షల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యం ఉండాలని భావిస్తున్నామని అన్నారు. ఉద్యోగులు కూడా అందుకు అనుగుణంగా కష్టపడాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa