ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:14 PM

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వడ్డించే ముందు సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. పదో తరగతి విద్యార్థులతో సమావేశమై బోర్డు పరీక్షలపై సూచనలు చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ముఖ్యంగా గణితంపై శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa