నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ZPHS పాఠశాలలో బుధవారం, పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు SMS ఎలక్ట్రికల్స్ యజమాని యువజన నాయకులు బొడ్డుపల్లి శ్రీను ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి జిల్లాలోనే పాఠశాలను మొదటి స్థానంలో నిలపాలని, ఉన్నత స్థితికి చేరుకొని గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూనూరు గణేష్, గోలి సాయికిరణ్, బొడ్డుపల్లి శ్రీకాంత్, ఆరూరి బాలకృష్ణ, కూరాకుల గోపాల్, అరూరి లక్ష్మణ్, మెరుగుమల్ల శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa