శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. తమ కాలనీలోని 400ల గజాల పార్కు స్థలం కబ్జాకు గురౌతోందని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి హద్దులు నిర్ధారించారన్నారు. ఆ ప్రహరీనే పునాదులుగా చేసి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. జీహెచ్ ఎంసీ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కు స్థలంగా నిర్ధారించుకుంది. మంగళవారం ఈ మేరకు ఆక్రమణలు తొలగించి 400ల గజాల స్థలంచుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగాపేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటుచేసింది. దీని విలువ రూ. 2 కోట్లవరకూ ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పార్కును కాపాడిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa