ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సంస్కరణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 12:19 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  తన వన్‌టైం రిజిస్ట్రేషన్ విధానంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఉద్యోగ ప్రకటనలకు అభ్యర్థుల అర్హతను కేవలం ఓటీఆర్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగానే నిర్ధారించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అత్యవసరంగా మారింది.కొత్త నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ ఓటీఆర్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఏడాదిలో రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అభ్యర్థులు తాము కొత్తగా సంపాదించిన అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25వ తేదీలోగా తమ ఐడీతో లాగిన్ అయి సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాలని కమిషన్ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa