ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంధన సరఫరాతో అష్టకష్టాలు పడుతున్న ఆటో వాసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 12:20 PM

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మార్చి 1వ తేదీ వరకు కిలో రూ.63 ఉన్న ఎల్‌పీజీ ధర, ఇప్పుడు ఏకంగా రూ.100 దాటడం రవాణా రంగాన్ని కుదిపేస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా రోజుకు 4 లక్షల కిలోల సీఎన్‌జీ డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అందులో సగం కూడా అందడం లేదు.హైదరాబాద్ నగరంలో సుమారు లక్షా 40 వేల వరకు ఎల్‌పీజీ, సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. ఇంధన ధరల పెరుగుదలకు తోడు సరఫరా కొరత డ్రైవర్లను వేధిస్తోంది. గ్యాస్ కోసం బంకుల వద్ద రెండు, మూడు గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తోంది. దీంతో రోజువారీ అద్దెకు వాహనాలు నడిపే డ్రైవర్లు తాము సంపాదించిన ఆదాయాన్ని గ్యాస్‌కే పోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇప్పటికే ఆదాయం కోల్పోయామని, ఇప్పుడు ఈ ధరల పెరుగుదల తమను మరింత కుంగదీస్తోందని ఆటో యూనియన్ నాయకులు వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa