తెలంగాణ రవాణా శాఖ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నూతన సంస్కరణలను తీసుకురానుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి పత్రాలను భౌతికంగా ఆర్‌టీఏ కార్యాలయాల్లో సమర్పించాల్సిన అవసరం లేదని, అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాలని రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరిది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.ఇప్పటివరకు వాహన కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో డీలర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బైక్‌లకు రూ.1000, కార్లకు రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం ఎక్స్-షోరూమ్ ధర మినహా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో, అక్రమాలకు తావులేని పారదర్శక విధానాన్ని తీసుకువచ్చారు.మార్చి 13 నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) పొందిన వాహనాలకు సంబంధించిన భౌతిక పత్రాలను ఆర్‌టీఏ కార్యాలయాలు స్వీకరించవు. రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన వెంటనే షోరూమ్‌లోనే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (HSNP) అమర్చే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa