ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 04:02 PM

శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో ఉన్న వేముకుంట ఉర్దూ మీడియం స్కూల్లో ఈ రోజు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్,మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి వేముకుంట  ఉర్దూ మీడియం స్కూల్లో పదవ తరగతి పరీక్షలకు రాయబోతున్న విద్యార్థులకు  పరీక్ష రాసేందుకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు, స్కేలు మొదలగు వస్తువులన్నీ  అందజేయడం జరిగినది. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,,,,, అందరూ పాస్ అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ శేర్లింగంపల్లి మండలంలో  మొదటి, రెండవ, మూడవ, స్థానంలో వచ్చిన  విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్  ఎం.డి గౌస్, ప్రకాష్, చందర్రావు, అనంతరెడ్డి, షబానా, బాబా మరియు స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు, స్కూల్ టీచర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు హాజరవడం జరిగినది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa