ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగట్టుకి పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 04:58 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మొక్కును తీర్చుకునేందుకు కరీంనగర్ నుండి కొండగట్టు వరకు 'అంజన్న ఆశీర్వాద యాత్ర' పేరిట పాదయాత్రను చేపట్టారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నూతన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు కాలినడకన వస్తానని ఆయన గతంలో ప్రకటించారు. ఆ మాట ప్రకారం, కరీంనగర్ మేయర్ పీఠం దక్కడంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa