ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టాన్ని ఉల్లంఘిస్తున్న హైడ్రా ఆగడాలను అసెంబ్లీలో నిలదీస్తాం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 18, 2026, 11:35 AM

రియల్ ఎస్టేట్ దందా కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ హైడ్రా చేస్తున్న ఆగడాలతో ఆందోళనకు గురవుతున్న బాచుపల్లి "ఏపీఆర్ ప్రణవ్ ఆంటీల్లా" బాధితులను ఈరోజు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... హెచ్ఎండిఏ ప్లాట్ల విక్రయాల కోసం రియల్ ఎస్టేట్ దండా చేసేందుకు గ్రీన్ జోన్ గా ఉన్న ప్రాంతంలో అక్రమంగా రోడ్డు వేస్తూ హైడ్రా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వమనేది ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ అనాలోచిత నిర్ణయాలను చేస్తూ హైడ్రా పేరుతో భయపెట్టడం సరికాదు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ హైడ్రా నిర్వహిస్తున్న ఆగడాలను అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఆర్ ప్రణవ్ ఆంటీల్లా  సంక్షేమ సంఘం సభ్యులు రాజిరెడ్డి, నాగిరెడ్డి, సంతోష్, ఆనంద్, రమణ, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు, గాజుల సుజాత, రవి కిరణ్, జ్యోతి నరసింహారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa