అమీన్పూర్ డివిజన్ పరిధిలోని జానకంపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ పాండు, సీనియర్ నాయకులు కొల్లూరి యాదగిరి, ఐలాపూర్ నర్సింగ్ రావు, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa