ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బకాయిల చెల్లింపులలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడి వెంటనే బకాయిలను చెల్లించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 23, 2026, 02:36 PM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026-27 ల్లో ఐదవ రోజు నిర్వహించిన ప్రశ్నోత్తరాలలో భాగంగా "రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు - పెండింగ్ బకాయిల చెల్లింపు" లపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమకు అందాల్సిన బెనిఫిట్స్ - బకాయిల చెల్లింపు పై ధర్నాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 30 - 40 సంవత్సరాలు తమ జీవితాన్ని ధారపోసి రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులై ప్రభుత్వం వద్ద రూపాయి, రూపాయి కూడ పెట్టుకున్న డబ్బులను చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలతో ఉద్యోగులలో ఒక అభద్రత భావం ఏర్పడింది. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను చిన్న చూపు చూస్తా ఉంది.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెంటనే సిపిఎస్ విధానానికి బదులు ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక ఎక్కడ దాని ప్రస్తావనే లేదు.  గతంలోనే పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పింది, నెలకు 700 కోట్లు ఇస్తామన్న దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.  రిటైర్డ్ ఉద్యోగులు ప్రతిసారి కోర్టులను ఆశ్రయిస్తేనే, కోర్టు మార్గదర్శకత్వంలోనే బకాయిలను పొందే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది.  దాదాపు 30 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన మైసయ్య అనే పోలీసు ఉద్యోగి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్ లు రాక ఆరోగ్యం బాగా లేక చనిపోగా, జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే ఉద్యోగి తమ గోడును మా నాయకులు హరీశ్ రావు గారి దృష్టికి తీసుకురాగా హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాతనే 29 లక్షల రూపాయల బకాయిలను చెల్లించారు.aఇకనైనా ప్రభుత్వం పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా "ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ - బకాయిల చెల్లింపు" లపై స్పష్టమైన సమాధానం చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa