TG: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో పాత కక్షలతో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో మెడపై దాడికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వివేక్, రఘుపతిని ఫోన్ చేసి పిలిచి, మద్యం సేవించే సమయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో ఈ దాడికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రఘుపతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa