ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన ఫిజియోథెరపీ సేవలు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2026, 12:00 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన Relief Physio Rehab కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.


ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.. ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ప్రమాదాలు,వృద్ధాప్య సమస్యలు,కండరాల నొప్పులు,శస్త్రచికిత్సల తర్వాత పునరుద్ధరణ చికిత్సలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని,ఇలాంటి ఆధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.స్థానిక ప్రజలు,నాయకులు,కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa