ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబర్‌పేట్‌లో కల్తీ ఉస్మానియా బిస్కెట్ల గుట్టురట్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2026, 01:58 PM

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లోని కమలానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, ఆకర్షణీయమైన రంగుల కోసం కెమికల్స్, నాసిరకం, పాడైన గుడ్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారీ సాగుతుండటంతో యజమాని మేరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa