విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద ఆగి ఉన్న లారీ కంటైనర్‌ను ట్యాంకర్ ఢీకొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లక్కారం తంగడేవనం వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంలో ట్యాంకర్ స్టీరింగ్ విరగడంతో అది రోడ్డుపైనే అడ్డంగా నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa