రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ మందిర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి 'శ్రీ సిద్ధి వినాయక' బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa