ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నాయకులపై కేసు కొట్టివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2026, 11:11 AM

నల్లగొండ పట్టణంలోని పానగల్‌ సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని 2018లో ధర్నా చేసిన 12 మంది బీజేపీ నాయకులపై నల్లగొండ టూటౌన్‌ పోలీసులు నమోదు చేసిన కేసును జిల్లా కోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ధర్నా చేశారని నమోదైన ఈ కేసు 8 ఏళ్లుగా కొనసాగింది. సోమవారం జిల్లా కోర్టు జడ్జి ఈ తీర్పు వెలువరించారు. గోలి మధుసూదన్‌రెడ్డి, మిర్యాల గిరి, జంజిరాల వెంకన్న, భీమనపల్లి శ్రీకాంత్‌, చింత యాదగిరి తదితరులపై ఈ కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa