ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2026, 12:50 PM

ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త . సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయిన భార్య కవిత(29)ను హత్య చేసిన భర్త సిద్ధారెడ్డి. మార్చి 27న ప్రియుడు పవన్ రెడ్డితో వెళ్లిపోయిన కవిత.. మార్చి 30న జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త. అదృశ్యం కేసు నమోదు చేసి.. జడ్చర్లలో ప్రియుడు పవన్ రెడ్డితో కవిత ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. కవితను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులతో వెళ్లి.. కారులో సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే కత్తితో భార్య గొంతులో పొడిచి హత్య చేసిన భర్త సిద్ధారెడ్డి . తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందిన భార్య కవిత . ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa