రేణిగుంట: మండలంలోని అత్తూరు పంచాయితీ మొలగమూడి దళితవాడలో సోమవారం వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ జంగారెడ్డి సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కుంభాభిషేక మహోత్సవంలో మండల ఇన్చార్జి బియ్యపు పవిత్ర రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె భక్తులకు అన్నదానం చేశారు. వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa