వినాయకుడు జన్మించిన, గణాధిక్యం పొందిన రోజును వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటాం. చవితి పూజలో వినాయక ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించాలి. చిన్నపళ్లెంలో బియ్యం పోయాలి. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి, తమలపాకులు పెట్టి స్వామి ప్రతిమను పళ్లెంలో ఉంచాలి. స్వామివారికి గరికలతో పాటు, 21 పత్రాల్తో పూజించి, వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించాలి.