బొజ్జ గణపయ్యకు బియ్యపు పిండితో చేసిన వంటకాలంటే ఎంతో ఇష్టమని పురాణగాథలు చెబుతున్నాయి. అందుకే కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు లడ్డూలు, పాలతాలికలు, రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఖరీదైన పండ్ల కంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన అరటి పళ్లనే నైవేద్యంగా పెట్టాలని పెద్దలు చెబుతారు.