ట్విట్టర్ బాటలోనే మెటా నడువనుందని, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ కోతలు వేలల్లో ఉండొచ్చని, నవంబర్ 9న ప్రకటన రావొచ్చని ఆంగ్లపత్రిక వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం మెటాలో 87000మంది ఉద్యోగులు ఉన్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో వాటాదారులను నిరాశపర్చినందున, 2023 వరకు ఉద్యోగుల సంఖ్యను పెంచబోమని, స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని మెటా సీఈఓ తెలిపారు.