దేశ మార్కెట్లో అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారు ‘ఈజ్-ఇ’ అందుబాటులోకి వచ్చింది. పుణెకు చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ కారును నేడు విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.4.97 లక్షలుగా ఉంది. స్థానిక రవాణా పన్నులు, బీమా ఛార్జీలు, యాక్సెసరీల ఛార్జీలు అదనం. మార్కెట్లలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ ధర గల వాహనం ఇదేనని సంస్థ పేర్కొంది. అయితే మొదటగా బుక్ చేసుకునే 10 వేల యూనిట్లకే ఈ ధర వర్తిస్తుందని తెలిపింది.