ఇక అన్ని రకాల టీవీ కార్యక్రమాలను నేరుగా సెల్ ఫోన్ లోనే ప్రసారం చేసే విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ఢిల్లీలో అమలు చేస్తామని కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఇది ఎఫ్ఎమ్ రేడియోలాగే పని చేస్తుందని చెప్పారు. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మల్టీ మీడియా కంటెంట్ నేరుగా వస్తుందని అన్నారు.