ట్విట్టర్ ఎలాన్ మస్క్ సొంతమయ్యాక సంస్థలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేకమందిని ఉద్యోగాల నుంచి తీసేయటం, బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేయటం వంటివి అయోమయానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో సంస్థకు గుడ్‌బై చెప్పాలని వందలాదిమంది ఉద్యోగులు నిర్ణయించుకున్నట్టు సమాచారం. వర్క్ ప్లేస్ యాప్ ‘బ్లైండ్’ నిర్వహించిన పోల్‌లో 180 మంది ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు.