ఫేస్ బుక్ ప్రొఫైల్ లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఫేస్ బేక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. యూజర్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలో మతపరమైన అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు, లింగ ప్రాధాన్యత గురించి వివరాలను అడిగేది. ఈ విధమైన సమాచారాన్ని వారి ప్రొఫైల్ నుంచి తొలగిస్తున్నట్టు యూజర్లకు ఫేస్ బుక్ నోటిఫికేషన్లను పంపిస్తోంది.