రానున్న ఐదారు నెలల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని 5జీ కి అప్ గ్రేడ్ చేస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 'దేశంలో మరే ఇతర టెలికాం సంస్థలకు గ్రామీణ ప్రాంతాల్లో లేని విస్తృతమైన నెట్ వర్క్ బీఎస్ఎన్ఎల్ కు ఉంది. ప్రస్తుతం ఉన్న 1.35 లక్షల బీఎస్ఎన్ఎల్ టవర్లను 5జీ కి మారుస్తాం. 5జీ టెస్టింగ్ కోసం టీసీఎస్ తో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకోనుంది' అని మంత్రి తెలిపారు.