దేశ ప్రజలను చలిపులి వణికిస్తుంది. గత మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్ దిగువకు పడిపోయాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 15 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని IMD వెల్లడింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సిటీలో ఇవాళ అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. కాన్పూర్‌లో 11 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి చంపేస్తున్నది.