దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా విధానాన్ని రద్దు చేసి పుట్టిన దేశం ప్రాతిపదికపై కాకుండా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశమిచ్చే ఈగిల్ చట్టానికి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మద్దతు ప్రకటించింది. చట్టబద్ధ ఉపాధికి సమాన అవకాశాల కల్పన బిల్లును ఈగిల్ చట్టంగా, హెచ్‌ఆర్ 3648గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో ఈ వారం ఓటింగ్ జరగనుంది. ఇది కనుక ఆమోదం పొంది, చట్టరూపం ధరిస్తే అమెరికాలో లక్షలాది వలసదారులకు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు ఎంతో మేలు జరుగుతుంది.