2023, జనవరి 1 నుంచి కొన్ని ఫోన్లలో తమ సేవలను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. సాఫ్ట్వేర్ అప్డేట్, సెక్యూరిటీ పరమైన లోపాల వల్ల 49 స్మార్ట్‌ఫోన్ మోడల్స్ లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
రేపటి వాట్సాప్ పనిచేయని ఫోన్లు ఇవే:
ఐఫోన్ 5, 5సీ, శాంసంగ్ గెలాక్సీ కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్‌కవర్ 2, ఏస్2, హెచ్‌టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్ఎల్, ఎల్జీ ఎనాక్ట్, ఎల్జీ లూసిడ్ 2, ఎల్జీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్‌పిరీయా ఆర్క్ ఎస్, ఎక్స్‌పిరీయా మిరో, ఎక్స్‌పిరీయా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్‌టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్‌టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ.