ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్రపట్టదు. దీంతో నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ఈ సమస్యకు రేగుపండుతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రేగు పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్, పోలిశాచరైడ్స్, ప్లైవనాయిడ్స్, సాపోనిన్స్, వంటివి ఉంటాయి. ఇవి నిద్ర బాగా వచ్చేందుకు ఉపయోగపడతాయి. ఇవి నరాలను శాంతింపజేసి మనల్ని నిద్రపోయేలా చేస్తాయి. టెన్షన్, ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.