ప్రమాదకరమైన కొవిడ్ XBB.1.5 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గుజరాత్ లో నమోదైంది. ఇది గత వేరియంట్ బీక్యూ.1తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటు వ్యాధి అని అమెరికన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. దీన్ని సూపర్ వేరియంట్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకత కలిగి ఉందని అమెరికన్ ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ వెల్లడించారు.