ప్రఖ్యాత టెక్ సంస్థ యాపిల్ కు చెందిన వాచ్ వర్ణ వివక్షకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. న్యూయార్క్ కు చెందిన అలెక్స్ మోరెల్స్ అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేయగా.. ఆ కంపెనీపైనా కేసు బుక్ చేశారు. వాచ్ లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ రీడర్ తప్పుడు ఫలితాలు చూపిస్తున్నట్లు కేసులో పేర్కొన్నారు. చర్మ వర్ణం మారినప్పుడు ఆ వాచ్ లో ఉన్న ఆక్సిజన్ రీడర్ సరైన రీతిలో రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వాచ్ లో ఆక్సీ మీటర్ టెక్నాలజీ సమర్థంగా పని చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. డార్క్ స్కిన్ టోన్ ఉన్న వారిలో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.