బీహార్ లోని గయ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ గా పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లుగా మాన్యువల్ స్కావెంజర్ గా పని చేసిన ఆమె, పౌర సంస్థల ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గయ డిప్యూటీ మేయర్ గా చింతాదేవిని సభ్యులు ఎన్నుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ కూడా ఆమెకు మద్దతు తెలిపారు. చింతాదేవి పారిశుద్ధ్య పనులే కాక కూరగాయలు కూడా అమ్మి జీవనం సాగించింది. అట్టడుగు వర్గానికి చెందిన మహిళ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం చరిత్రాత్మకం అని గయ మేయర్ గా ఎన్నికైన గణేష్ పాశ్వాన్ ప్రశంసించారు.