ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2024 నుండి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 4జీ కోసం టీసీఎస్, సీ-డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్ఎన్ఎల్ షార్ట్ లిస్ట్ చేసిందని, దీన్ని ఏడాది వ్యవధిలో 5జీకి అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. ఒడిషాలో జియో, ఎయిర్ టెల్ 5జీ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.