ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ కు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. క్రమంగా సంస్థ రెవెన్యూ తగ్గిపోతూనే ఉంది. తాజాగా మరో 40 శాతం మేర ఆదాయం పడిపోయినట్లు తేలింది. ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులకు గానూ మస్క్.. టెస్లా షేర్లు అమ్ముకున్నట్లు సమాచారం. మార్పుల కారణంగా ట్విట్టర్ లో యాడ్స్ ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడడంతో రెవెన్యూ కోల్పోవాల్సి వచ్చింది.