భారతీ ఎయిర్టెల్ తన యూజర్లకు షాకిచ్చింది. కనీస రీచార్జ్ ధరపై రూ.56 పెంచింది. రూ.99 రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.155కి పెంచింది. దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలో దీనిని అమలు చేయనుంది. అప్గ్రేడ్ చేసిన రూ.155 ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ ప్యాక్ ఉంటుంది. 1 జీబీ ఇంటర్నెట్ డేటా, 300 ఫ్రీ ఎస్ఎంఎస్లు ఉంటాయి. అయితే కొన్ని నంబర్లకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులే అని చూపిస్తోంది.