ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కొలచిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న జామి శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతరకు శనివారం ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో జామి గ్రామంలో గల మూడు కోవెళ్ళ శివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేద పండితులు భానుమూర్తి జాతరకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఫిబ్రవరి 26, 27, 28వ తేదీలలో జాతరను జరిపేందుకు నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిప్పాడ లక్ష్మి, ఉప సర్పంచ్ అల్లు పద్మ, గ్రామ పెద్దలు అల్లు సత్యాజి, నెక్కల అచ్యుతరమణ, వాక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.