పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను నెల రోజుల్లోగా గ్రౌన్డింగ్ జేరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను గడువు లోగానే పరిష్కరించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఫుడ్ ఉద్యాన శాఖ, మత్స్య శాఖల ద్వారా పి.ఎం.జి.ఎస్.వై క్రింద యువతకు అవకాశాలు కల్పించాలని సూచించారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అక్టోబర్ నుండి జనవరి వరకు 104 దరఖాస్తులు అందగా 82 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 19 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, 3 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పాపారావు వివరించారు. స్పందించిన కలెక్టర్ దరఖాస్తులను నేరుగా తిరష్కరించవద్దని, దరఖాస్తు లోని లోపాలను సవరించి తిరిగి సమర్పించమని చెప్పి, అందుకు తగు సలహాలను అందించాలని సూచించారు. ఎస్. సి. , ఎస్. టి, మహిళల కు సబ్సిడీ 35 నుండి 45 శాతం వరకు ఉందని, అవగాహన కలిగించి ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని తెలిపారు.