రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పాటుపడుతున్నారని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామంలో శనివారం 159 వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా శ్రేయస్సు పరమావధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. వైసిపి పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తారని ఆయన తెలిపారు. అర్హత కలిగి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందక పోయినట్లయితే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో గ్రామంలో సమస్యలను అక్కడికక్కడే అధికారుల సమక్షంలో పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ వాకాడ రాంబాబు , టౌన్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ రెహమాన్, పోతనపల్లి వెంకట్రావు, స్థానిక నాయకులు ఎంపీటీసీ కనకమహాలక్ష్మి, అల్లు మహాలక్ష్మి నాయుడు (బుజ్జి), అల్లు సుధీర్, లగుడు అవతారం, పైడితల్లి, లగుడు సత్యారావు, శ్రీనివాసరావు, పైడిరాజు, వరి కృష్ణ, సీతంపేట చింతల మూర్తి, వేమలి జగదీష్, రేవలపాలెం రామకృష్ణ, ఎస్. కోట తలారి అనంతరావు, ఇతర ముఖ్య నాయకులు మరియు మండలాధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.