విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరగటంతో క్యూ లైన్ లో నుండి వచ్చే భక్తులకు కొంత మేరకు ఇబ్బందికరంగా మారింది. అమ్మవారిని దర్శించుకొని వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం చేత ఉచిత అన్నదాన కార్యక్రమానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.