ప్రస్తుతం చాలా మంది ఈవీ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రూ.20 లక్షల లోపు ధరలో లభించే ఈవీ కార్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ ఈవీ: ఈ కారు ప్రైమ్, మాక్స్ వెర్షన్లలో లభిస్తోంది. ప్రైమ్ లో 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, మాక్స్ లో 40.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్రైమ్ వెర్షన్ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 312 కి.మీ మైలేజ్ ఇస్తుంది. మాక్స్ వెర్షన్ కారు 453 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రైమ్ కారు ధర రూ14.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంటుంది. మాక్స్ కారు ధర రూ.16.49 లక్షల నుంచి రూ.18.99 లక్షల మధ్య ఉంటుంది.
మహీంద్రా ఎస్ యూవీ 400: ఈ కారు ఎలక్ట్రిక్ ఎస్ యూవీ బేస్ తో 34.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 375 కి.మీ మైలేజ్ వస్తుంది. ఈ కారులో టాప్ ఎండ్ వెర్షన్ లో 39.4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ వెర్షన్ లో ఒక్కసారి చార్జ్ చేస్తే 456 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ధర రూ.15.99 లక్షల నుంచి రూ.18.99 లక్షల వరకు ఉంటుంది. ఈసీ, ఈఎల్ రెండూ ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ తో ఉంటుంది. ఇది గరిష్టంగా 150 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 310 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ 8.3 సెకన్లలోనే 100 కి.మీ పరిధిని అందుకుంటుంది.
టాటా టియాగో ఈవీ:
ఈ కారు రూ.8.49 లక్షలకే లభిస్తుంది. రెండు వెర్షన్లలో వచ్చే ఈ కారు 19.2 లేదా 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. ఈ కార్లు ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తాయి. 15 ఏ చార్జర్ తో చార్జ్ చేయడానికి సుమారు 5-6 గంటల టైం పడుతుంది.
టాటా టిగోర్ ఈవీ కారు 26 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కి.మీ మైలేజ్ వస్తుంది. ఈ కారులో డీసీ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. దీని ద్వారా 59 నిమిషాల్లో 10% నుంచి 80% వరకూ చార్జ్ చేయవచ్చు. 15ఏ చార్జర్ తో అయితే 9 గంటలు చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ కారు ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు 5.7 సెకన్లలోనే 60 కి.మీ స్పీడ్ ను అందుకుంటుంది.