ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మరో 3 కొత్త బైక్ లను మార్కెట్ లోకి తీసుకురానుంది. ఔట్ ఆఫ్ ద వరల్డ్, ఓలా పర్ఫార్మెక్స్, ఓలా రేంజర్ అనే 3 ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో కొన్ని అదిరిపోయే ఫీచర్లు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఔట్ ఆఫ్ ది వరల్డ్:
ఈ ఎలక్ట్రిక్ బైక్ ను మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 174 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కి.మీ. ఈ బైక్ ధర 1.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ లో అడ్వాన్స్డ్ డ్రైవర్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉంటుంది.
ఓలా పర్ఫార్మెక్స్:
ఇది మిడ్ రేంజ్ బైక్. 3 రకాల వేరియంట్లలో లభించనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 91 నుంచి 174 కి.మీ వరకు వెళ్లొచ్చు. ఈ బైక్ స్పీడ్ గంటకు 91 నుంచి 95 కి.మీ వరకు ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ఓలా రేంజర్ బైక్:
ఈ బైక్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఆ బైక్ 80 కి.మీ వరకు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 91 కి.మీ ఉంటుంది. ఈ బైక్ కూడా పలు రకాల వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ ధర రూ.85 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.