మహీంద్రా కంపెనీ త్వరలో థార్ 5 డోర్ ఎస్‌యూవీని మార్కెట్ లోకి తీసుకురానుంది. దీపావళి పండుగకి ముందు లేదా ఆగస్టు 15 నాటికి ఈ కారు మార్కెట్ లోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది పెట్రోల్, డిజిల్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. స్కార్పియో ఎన్ పవర్ ట్రెయిన్ ఆధారంగా కొత్త థార్ ఉండే అవకాశం ఉంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ టర్బో డీజిల్ వేరియంట్లలో రావొచ్చు.
3-డోర్ మోడల్ తో పోలిస్తే కొత్త 5 డోర్ల మహీంద్రా థార్ 300ఎంఎం పొడవైన వీల్‌బేస్ కలిగి ఉండే అవకాశం ఉంది. టైర్ల మధ్య ట్రాక్ లేదా వెడల్పును పెంచే ఛాన్సుంది. థార్ 3 డోర్ తో పోలిస్తే 5 డోర్ లో గణనీయంగా పొడవు పెరుగుతుంది. డోర్-మౌంటెడ్ స్పేర్ వీల్, సిగ్నేచర్ గ్రిల్, రౌండ్ హెడ్ ల్యాంప్‌లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లను కలిగి ఉంటుంది. ఇంటీరియర్ అంతా 3 డోర్ థార్ ను పోలి ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, సన్ గ్లాస్ హోల్డర్, రివైజ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. బూట్ స్పేస్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.