బజాజ్ ఆటో కంపెనీ 'చేతక్' పేరుతో ఇప్పటికే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ స్టీల్ బాడీ ప్యానెల్స్ తో తయారైంది. యాప్ ద్వారా ఈ స్కూటర్ తో కనెక్ట్ అవ్వొచ్చు. దీనికి బైక్ బెల్ట్ కాకుండా స్టీల్ గేర్ డైరెక్ట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్ ను అమర్చారు. ఏపీలో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.1.6 లక్షలుగా ఉంది. తెలంగాణలో రూ.1.56 లక్షలుగా ఉంది.
ఈ స్కూటర్ లో ఐపీ 67 వాటర్ ప్రొటెక్షన్ లభిస్తుంది. యాప్ ద్వారా చార్జింగ్ స్టేటస్, బ్యాటరీ స్టేటస్, ఫైండ్ వెహికల్, నోటిఫికేషన్స్ వంటి సేవలు పొందొచ్చు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 90 కి.మీ పైగా ఈ స్కూటర్ పై వెళ్లొచ్చు. కేవలం 4 గంటల్లోనే బైక్ బ్యాటరీ ఫుల్ అవుతుంది. బ్యాటరీపై మూడేళ్లు లేదా 50,000 కి.మీ వరకు వారంటీ ఉంటుంది.