ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. ఏకంగా 18సార్లు తీవ్ర ప్రకంపనలు రావటంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 640 మందికిపైగా దుర్మరణం చెందగా వేలాదిమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.