ప్రభుత్వ రంగ బ్యాంకుల నివేదిక ప్రకారం గత పదేళ్లలో మొత్తం 4,61,017 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి విద్యా రుణాలు పొందారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 42,364 మంది విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు విద్యా రుణాలు పొందినట్లు పేర్కొంది. దేశంలో విద్యా రుణం పొందుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, 2012-13లో మొత్తం 22,200 మంది విద్యార్థులు రుణాలు పొందారని తెలిపింది. 2020 వరకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. 2021లో 69,898 మంది విద్యార్థులు విద్యా రుణాలను పొందారు.