వేధించే ఆలోచనలు, భావోద్వేగాలు పీడకలల రూపంలో రాత్రి నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ క్రమంలో రోజంతా మీ పని ఒత్తిడి, ఎమోషన్స్ పడుకునే ముందు గుర్తు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పడుకోవడానికి 2 గంటల ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. పడుకోవడానికి 2 గంటల ముందే ఫోన్, టీవీను చూడొద్దని, మంచి స్లో బీట్ సాంగ్స్ వింటే హాయిగా నిద్ర పడుతుందని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ధ్యానం, మంచి సువాసన గల రూం స్ప్రేలు వినియోగించాలంటున్నారు.